News October 4, 2025

మెదక్: బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

మెదక్ నుంచి ముక్త భూపతిపూర్ వెళ్లే తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో వర్షాలు, వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News October 3, 2025

MDK: ఎన్నికలే లక్ష్యం.. GST యే అస్త్రం!

image

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తోంది. ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, GST తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

News October 3, 2025

MDK: కాశీ గంగా హారతిలో పాల్గొన్న హరీశ్ రావు

image

సిద్దిపేట జిల్లా నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయంలో గురువారం దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కాశీ గంగా హారతి, రావణ దహన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మన బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అని, పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలన్నారు. బావి తరాలకు మనం ఇచ్చే అసలైన సంపద ఇదే అని అన్నారు.

News October 3, 2025

మెదక్: మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్ గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఒపీ రిజిస్టర్, పరిశీలిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు.