News October 5, 2025

మెదక్: మద్యం దుకాణాలకు 6 దరఖాస్తులు

image

జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ పరిధి పోతంశెట్టిపల్లి (15వ దుకాణం) 3 దరఖాస్తులు, పాపన్నపేట (10) ఒక దరఖాస్తు, రామాయంపేట పరిధి మాసాయిపేట (42) ఒకటి, నార్సింగి (43) ఒక దరఖాస్తురాగా మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 18 వరకు పని దినాలలో ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 5, 2025

MDK: పల్లెల్లో త్రిముఖ పోరు.. గుండెల్లో రైల్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు 8న హైకోర్ట్ ఏం తీర్పు ఇవ్వనుందని, మరోకవైపు ఈసారి పల్లెల్లో త్రిముఖ పోరు ఉండడంతో ఓట్లు చీలిక ఏ విధంగా ఉంటుందోనని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటర్ల నాడి ఎటు ఉందో చూడాలి మరి. మీరి మీ ప్రాంతంలో ఏవిధంగా ఉంది కామెంట్.

News October 5, 2025

RMPT: రసవత్తరంగా మారనున్న జడ్పీటీసీ ఎన్నికలు

image

రామాయంపేట జడ్పీటీసీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో రామాయంపేటను జనరల్‌గా రిజర్వేషన్ ప్రకటించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కూడా జనరల్ కావడంతో రామాయంపేటలో పోటీ రసవత్తరంగా మారునుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి హేమాహేమీలు బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది.

News October 5, 2025

MDK: బైక్‌ దొంగకు నిప్పు.. ఒకరి పరిస్థితి విషమం

image

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్‌ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.