News March 5, 2025

మెదక్: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి

image

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News March 5, 2025

MHBD: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: SP

image

MHBD జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల 163 BNNS(144సెక్షన్) అమలులో ఉండనుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈనెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

News March 5, 2025

ఇంటర్ విద్యార్థులకు BIG ALERT

image

AP: ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్‌లో మాత్రమే తీసుకుని రావాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్‌తో తీసుకొస్తే పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. వెబ్‌సైట్, వాట్సాప్‌లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉండటంతో కొందరు కలర్ పేపర్లపై ప్రింట్లు తీసుకొస్తున్నారని తెలిపారు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి.

News March 5, 2025

కవిటి : పెళ్లి ఫిక్స్.. యువతి సూసైడ్

image

నిశ్చితార్థమై పెళ్లి జరగాల్సిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కవిటి (M) కపాసుకుద్దిలో మంగళవారం జరిగింది. ఎస్సై వి. రవివర్మ కథనం.. వడ్డిపుట్టుగకు చెందిన సోనియాకు ఇటీవల నిశ్చితార్థమైంది. కాగా ఆమె పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!