News February 10, 2026

మెదక్: మున్సి‘పోల్’ క్లైమాక్స్.. అభ్యర్థుల్లో ఖర్చు టెన్షన్!

image

మున్సిపల్ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. రేపే పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థుల్లో గెలుపు ధీమా కంటే ఖర్చుపైనే ఆందోళన కనిపిస్తోంది. గెలుపు కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు చేయగా, ఇప్పుడు వాటిని తిరిగి ఎలా చెల్లించాలనే టెన్షన్ నెలకొంది. ఒక్కో అభ్యర్థి ఇప్పటికే రూ.10 నుంచి 20 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగియడంతో పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి.

Similar News

News March 27, 2026

గుంటూరులో ఉచిత వృత్తి విద్యా శిక్షణ

image

గుంటూరు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారికి భోజనం, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ఉచితంగా టూల్ కిట్ కూడా అందజేస్తారు. ఆసక్తి గల వారు సంబంధిత ఆన్‌లైన్ లింక్ ద్వారా తమకు నచ్చిన కోర్సుకు రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

News March 27, 2026

ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

image

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.

News March 27, 2026

నేటి నుంచి విజయవాడలో ఐజేయూ జాతీయ ప్లీనరీ

image

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెుల 27, 28, 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28న సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కుల గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.