News October 21, 2025

మెదక్ యువకుడికి 8 GOVT జాబ్స్

image

పాపన్నపేట(M) పొడ్చన్‌పల్లికి చెందిన అరక అజయ్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జ్యోతి, సంజీవరావుల కుమారుడు అజయ్ ఇప్పటివరకు ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరిన ఆయన.. SCR లోకో పైలట్, కానిస్టేబుల్, ఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. 2023లో SIగా ఎంపిక కాగా, తాజాగా గ్రూప్-2లో ప్రతిభ సాధించి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించారు.

Similar News

News October 21, 2025

HYD: సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాసుల మోత మోగించారు. దీంతో ‎బాణసంచా బాధితులతో సరోజినీ దేవి ఆస్పత్రి నిండిపోయింది. ‎నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ‎సరోజినీ దేవి హాస్పిటల్‌లో సుమారు 70 మంది బాధితులు కాలిన గాయాలతో చేరారు. ‎గాయపడిన వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

News October 21, 2025

ASF: ‘ప్రతి ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలి’

image

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ASF జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి పోర్టల్‌లోని హెచ్ఆర్ మాడ్యూల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకురాలు భానుమతి తెలిపారు. ప్రతి ఉద్యోగి ఆధార్, పాన్, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోనట్లయితే డీడీఓలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు రావని, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌ ఓపెన్ కాదన్నారు.

News October 21, 2025

మెగా జాబ్ మేళాలో పాల్గొనాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ఈనెల 25న HZNRలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు NLG జిల్లా నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా పై MGU, ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.