News March 11, 2025

మెదక్: యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. నార్సింగ్‌కు చెందిన యువకుడు స్వామి(38) ఇటీవల భార్య కాపురానికి రాకపోవడంతో మద్యంకు బానిసగా మారారు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన స్వామి వల్లూరు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

Similar News

News December 23, 2025

కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో డిఫెన్స్‌లోకి రేవంత్ సర్కార్: హరీశ్ రావు

image

తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. పేదల సమస్యలు వదిలి షోలు, సమ్మిట్‌లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. కో ఆపరేటివ్ ఎన్నికలు తప్పించుకుంటూ భయంతో పాలన సాగుతోందన్నారు.

News December 23, 2025

MDK: నాణ్యమైన దర్యాప్తుతో న్యాయం చేయాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పాల్గొన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసును నాణ్యంగా, వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

News December 23, 2025

‘మీ డబ్బు-మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల రికవరీ కోసం RBI ఆదేశాల మేరకు చేపట్టిన ‘మీ డబ్బు-మీ హక్కు’ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,65,053 ఖాతాల్లో దాదాపు రూ. 21.32 కోట్ల మేర నగదు క్లెయిమ్ కాకుండా నిలిచిపోయిందని వెల్లడించారు.