News March 19, 2025
మెదక్ యువతకు GOOD NEWS

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మెదక్ జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
Similar News
News July 7, 2025
మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.
News July 7, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమానికి 61 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు-29, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇళ్లు-7, ఇతర సమస్యలకు సంబంధించి 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.