News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 22, 2025
జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా…!

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం బాన్సువాడ, రామారెడ్డిలో అత్యధికంగా 43.6, మద్నూర్‌లో 43.4, పాల్వంచ, కామారెడ్డి, బిచ్కుంద లలో 43.3, గాంధారిలో 43.1, బిక్కనూరులో 43.0. అత్యల్పంగా నాగిరెడ్డిపేట్ మండలంలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, అవసరమైతే తప్ప బయట తిరగవద్దు అని అధికారులు సూచిస్తున్నారు.
News April 22, 2025
సిరిసిల్ల: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలి

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిలజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
News April 22, 2025
విశాఖలో పౌష్టికాహార ముగింపోత్సవాలు

విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరినాలో పౌష్టికాహార ముగింపోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.