News April 22, 2025

మెదక్: రిసోర్స్ పర్సన్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా, మండల స్థాయి రిసోర్స్ పర్సన్‌ల కోసం దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తున్నట్లు మెదక్ డీఈఓ రాధా కిషన్ తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ వారి ఆదేశానుసారం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్‌లుగా వ్యవహరించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి 28న ప్రకటిస్తారన్నారు.

Similar News

News July 4, 2025

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా బాలయ్య నియామకం

image

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా న్యాయవాది బాలయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ పీపీగా నియమితులైన బాలయ్యను మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మర్కంటి రాములు, కార్యదర్శి శిరిగా కరుణాకర్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

News May 8, 2025

మెదక్: జాతీయ లోక్ అదాలత్‌పై సమావేశం

image

మెదక్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం. సుభవల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు పాల్గొన్నారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి సిరి సౌజన్య పాల్గొన్నారు.

News May 7, 2025

జప్తి శివునూరు గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

image

నార్సింగ్ మండలం జప్తి శివునూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద సుధాకర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన సుధాకర్ జప్తి శివునూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ, సంతానం లేకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.