News August 27, 2025
మెదక్: రేపు విద్యాసంస్థలకు సెలవు..!

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనకు అనుగుణంగా సమన్వయం పాటించాలని సూచించారు.
Similar News
News August 27, 2025
SRSP UPDATE: 39 గేట్లు ఓపెన్

కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
News August 27, 2025
ADB: భారీ వర్షాలపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్ష

వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News August 27, 2025
ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

AP: మహారాష్ట్ర గవర్నర్, NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి.