News August 10, 2025

మెదక్: ‘రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి’

image

ఈనెల 13 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా పాసు పుస్తకాలు పొంది 18-59 ఏళ్ల వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Similar News

News August 13, 2025

మెదక్: బాధితులకు అండగా భరోసా సెంటర్: ఎస్పీ

image

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో గల భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్‌తో కలిసి సందర్శించారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై అరా తీశారు.

News August 12, 2025

మెదక్: అధిక వర్షాలపై కలెక్టర్ సమీక్ష

image

అధిక వర్షాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్షించారు. రానున్న 72 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తగు ఆదేశాలు జారీ చేశారు. అధిక వర్షాలు వల్ల జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2025

మెదక్: ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరంగకుండా తనిఖీలు చేయాలి: కలెక్టర్

image

రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.