News December 22, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హవేలి ఘనాపూర్ మండలం శాలిపేట టర్నింగ్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన దాసరి సుమన్ (26), గుండు బాలయ్య బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2025
శివకోడులో మెట్లపై నుంచి జారిపడి యువ ఆర్టిస్ట్ మృతి

కోనసీమ జిల్లా శివకోడులో జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన యువ ఆర్టిస్ట్ పాలపర్తి భవ్యశ్రీ(17) దుర్మరణం పాలైంది. జాతరలో ప్రదర్శన ముగించుకుని మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళాకారిణి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈమె జాతరలలో పలు డ్యాన్స్ ప్రొగ్రామ్స్‌లో డ్యాన్స్ చేసినట్లు సమాచారం.
News December 25, 2025
కొబ్బరి తోటలకు ‘తెల్లదోమ’ ముప్పు: సాజా నాయక్

జిల్లాలో 13,650 హెక్టార్లలో విస్తరించిన కొబ్బరి తోటలపై రాబోయే మూడు నెలల్లో తెల్లదోమ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ హెచ్చరించారు. దీని నివారణకు పవర్ స్ప్రేయర్‌తో నీళ్లు, వేపనూనె, ఈసారియా ఫ్యూమోసోరోజియా పిచికారీ చేయాలని సూచించారు. పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు, మిత్రకీటకాలను సంరక్షించుకోవడం ద్వారా తెల్లదోమను అరికట్టవచ్చని గురువారం తెలిపారు.
News December 25, 2025
చైనా మాంజా వాడితే జైలుకే: సీపీ హెచ్చరిక

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇలాంటి మాంజాతో పక్షులతో పాటు ప్రాణికోటికి, వాహనదారులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, యువత పర్యావరణహితమైన దారాలను మాత్రమే వాడాలని, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ సూచించారు.


