News September 13, 2024
మెదక్: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

ఈనెల 28 నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Similar News
News February 3, 2026
మెదక్: మున్సిపల్.. తల్లి, కొడుకు పోటీ

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో రక్తసంబంధీకుల పోటీ ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఛైర్మన్ బట్టి జగపతి సతీమణి లలితతో పాటు ఆమె కుమారుడు ఉదయ్ కూడా బరిలో నిలిచారు. గతంలో 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన లలిత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, గత ఎన్నికల్లో 5వ వార్డులో ఓటమి చెందిన ఉదయ్ ఈసారి విజయంపై ధీమాతో ఉన్నారు. తల్లి, కొడుకుల ఫలితం ఎలా ఉంటుందోనని పట్టణంలో చర్చ నడుస్తోంది.
News February 3, 2026
కాళ్లకల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మనోహరాబాద్ మండలం కాల్లకల్‌లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కుమార్(25) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాళ్లకల్‌లో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
News February 3, 2026
మెదక్: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 4 ప్రాజెక్టులు

వైజ్ఞానిక ప్రదర్శనలో సీనియర్ విభాగంలో పాల్గొని ప్రతిభను చాటిన 4 ప్రాజెక్టులను జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు డీఈఓ విజయ, డీఎస్ఓ రాజిరెడ్డి తెలిపారు.
1. బి.మహతి, తూప్రాన్ – వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నయం
2. అక్షయ్, మెదక్ మాచవరం-ఎమర్జింగ్ టెక్నాలజీ
3. గణేశ్ చీకోడ్ లింగాయపల్లి ఉన్నత పాఠశాల-నీటి సంరక్షణ. నిర్వహణ
4. ఆఫీఫా, మెదక్ వినోద భరిత గణితం


