News April 10, 2025
మెదక్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన వినోద(34)కు కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన చెల్లి ప్రవీణ్ కుమార్‌తో వివాహమైంది. భర్త ప్రవీణ్, అత్త సత్తెమ్మ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో మార్చి 31న వినోద విషం తాగింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 14, 2025
భద్రాద్రి జిల్లాలో తొలి సర్పంచిగా విజయం

రెండో విడత ఎన్నికల్లో భాగంగా అశ్వారావుపేట మండలం మొద్దులమాడ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పండురెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థిపై 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు.
News December 14, 2025
FLASH: MDK: 6 ఓట్లతో WIN

చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామ సర్పంచ్‌గా శంకర్ సబిత గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి శ్వేతపై 6 ఓట్ల తేడాతో అమె విజయం సాధించారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి సబిత విజయం సాధించారు. మండలంలో వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తొలి ఫలితం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమౌతుంది.
News December 14, 2025
ఎమ్మెల్యే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఏసీపీ

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట పోలీసులపై చేసిన ఆరోపణలను సిద్దిపేట పోలీస్ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఏసీపీ రవీందర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ, మిగతా అభ్యర్థులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారనే MLA వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, అవాస్తవం అని వివరించారు. అసత్య ఆరోపణలపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


