News August 22, 2025
మెదక్: ‘విద్యారంగాన్ని బలోపేతం చేయాలి’

ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీష్ అన్నారు. మెదక్ పట్టణంలో బీ.సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినిలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News August 22, 2025
సంగారెడ్డి: ఈనెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్లకు అపరాధ రుసుముతో ఈనెల 31 వరకు అడ్మిషన్ పొందవచ్చని జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి గురువారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి వంద రూపాయలు , ఇంటర్మీడియట్‌కి రూ. 200 అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News August 22, 2025
EP-43: ధనవంతులయ్యే మార్గాలు ఇవే: చాణక్య నీతి

కొంతమంది ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు. ధనవంతులు అయ్యేందుకు కొన్ని పద్ధతులు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి. ఇలాంటి డబ్బు మాత్రమే ఎప్పటికీ నిలుస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా అది మీ నియంత్రణలోనే ఉండాలి. అనవసర వస్తువులపై ఖర్చు చేయకూడదు. డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలి. ఇలా చేస్తే మీ చెంతకే సక్సెస్ వస్తుంది’ అని తెలుపుతోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 22, 2025
KMR: భర్త హత్య.. భార్య, ప్రియుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడింది. SP రాజేశ్ చంద్ర వివరాలు.. దేవునిపల్లికి చెందిన షబ్బీర్‌పై మిస్సింగ్ కేసు నమోదైంది. మరుసటి రోజు తాడ్వాయి(M) కన్కల్లో అతని శవం దొరికింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రియుడు హన్మంతుతో కలిసి భర్తను చంపించినట్లు నసిమా పోలీసుల విచారణలో ఒప్పుకొంది. వారిని KMR కోర్టులో హాజరుపరచగా జడ్జి జీవిత ఖైదు శిక్షతో పాటు, ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చారు.