News April 2, 2025
మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 2, 2025
నా ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారు: జస్టిస్ ఎన్వీ రమణ

AP: రాజ్యాంగ సూత్రాలను సమర్థించిన న్యాయవ్యవస్థ సభ్యులు బదిలీలు, ఒత్తిడిని ఎదుర్కొన్నారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టారని చెప్పారు. వీఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
News November 2, 2025
పాలమూరు వర్సిటీ.. రేపు ఓరియంటేషన్ ప్రోగ్రాం

పాలమూరు యూనివర్సిటీలోని అకడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో రేపు ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మాలవి తెలిపారు. LL.B(3ydc) & LL.M 1 బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఉదయం 10:30కు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) జీఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నారన్నారు. విద్యార్థులు తప్పక హాజరుకావాలని ఆమె కోరారు.
News November 2, 2025
మునిపల్లి: తాటిపల్లి వైన్స్‌కు భారీ డిమాండ్.. ఈనెల 3న లక్కీ

మునిపల్లి మండలం తాటిపల్లి వైన్స్‌కు లైసెన్స్ మంజూరు కోసం ఈనెల 3న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర తెలిపారు. ఈ ఒక్క వైన్స్ కోసం ఏకంగా 97 దరఖాస్తులు వచ్చాయని, దీని ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 2.91 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. డ్రాను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య సమక్షంలో తీయనున్నారు.


