News January 11, 2026

మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 10, 2026

మెదక్: 686 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలటీల పరిధిలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 74 వార్డులు, 148 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 686 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 17 రూట్లలో మొబైల్ పార్టీ, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.

News February 10, 2026

MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

image

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.