News March 23, 2025
మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 24, 2025
మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు…!

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. హవేలిఘనపూర్, రేగోడ్ 36.6, అల్లాదుర్గ్ 36.5, పాపన్నపేట్ 36.4, కౌడిపల్లి, టేక్మాల్ 36.0, పెద్దశంకరంపేట్ 35.9, మెదక్ 35.8, నర్సాపూర్, వెల్దుర్తి 35.3, కుల్చారం 34.8, శివ్వంపేట, మనోహరాబాద్ 34.7°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
News March 24, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ వార్

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నారు. మరి మీ కామెంట్..
News March 24, 2025
MDK: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.