News December 11, 2024
మెదక్: వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ !

వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ మం. కొరంపల్లికి చెందిన ప్రభాకర్‌కు పాపన్నపేట మం. గాందారిపల్లి చెందిన లావణ్య(38)తో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా లావణ్య నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. అయితే తన చెల్లి చివరిగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్న కాశీనాథం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 13, 2026
మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
BREAKING: రామాయంపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

రామాయంపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
మెదక్: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 సేవలు

మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కో ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని ఈఎంటీ అలీముద్దీన్, పైలెట్ అఫ్రోజ్ సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.


