News April 8, 2024

మెదక్: వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

image

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలుపుతూ సిద్దిపేట త్రీ టౌన్ కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఐకెపి, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News September 9, 2025

మెదక్: కాళోజీ సేవలు చిరస్మరణీయం: డీఆర్ఓ

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని డీఆర్ఓ భుజంగరావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ వ్యక్తిత్వం, రచనలు ప్రజలను చైతన్య పరిచాయన్నారు. ఆయన చూపిన దారిని విడవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనస్, అధికారులు పాల్గొన్నారు.

News September 9, 2025

మెదక్: ప్రజాకవి కాళోజీకి ఎస్పీ నివాళులు

image

జాతీయ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణకు కవిత్వం ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహానుభావులని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 9, 2025

మెదక్: ‘ఫిర్యాదుల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలి’

image

మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడానికి, భారత ప్రభుత్వం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం అమలులో ఉన్నట్లు జిల్లా అధికారి హేమ భార్గవి తెలిపారు. ఈ చట్టం ప్రభుత్వం, ప్రైవేట్ ప్రతి యజమాని లైంగిక వేధింపులు లేని కార్యాలయాన్ని అందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గత ఫిర్యాదులు, కార్యాలయంలో లైంగిక వేదింపుల ఫిర్యాదులను పరిష్కారం కోసం ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.