News January 2, 2025
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్‌ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్‌లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
Similar News
News January 5, 2025
సిద్దిపేట: సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు.
News January 4, 2025
సిద్దిపేట: నిషేధిత చైనా మాంజా అమ్మితే చర్యలు: సీపీ
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజతో తలెత్తే అనార్థాలపై అందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 4, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్ జిల్లాలోని బోడగట్టు, మనోహరబాద్, శివంపేట, నార్సింగి, కుల్చారం, సంగారెడ్డి జిల్లా కోహిర్, న్యాల్కల్, అల్మాయిపేట్, మాల్చెల్మా, నల్లవల్లి, అల్గోల్, సత్వార్, లక్ష్మీసాగర్, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్, పోతారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.