News February 19, 2025
మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్య చేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. సహజమరణంగా నమ్మించే ప్రయత్నంచేయగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 7, 2025
ఇంకొల్లు: సినీ ఫక్కీలో దొంగతనం

సినీ ఫక్కీలో దొంగతనం జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిలంకూరి కాంతయ్య బంగారు నగలు విడిపించుకునేందుకు రూ.3.90 లక్షలతో బ్యాంకుకు వెళ్లాడు. వడ్డీ కింద మరో 10 వేల కోసం ఇంటికి బయలుదేరగా దుండగులు బైక్‌పై వచ్చి రూ.200ల నోటు కింద పడేశారు. కాంతయ్యను మభ్యపెట్టి, సైకిల్‌పై ఉన్న నగదుతో పారిపోయారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో డెడ్‌లైన్ ముగియగా ఈనెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం <
News November 7, 2025
పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.


