News May 2, 2024
మెదక్: వ్యక్తి మిస్సింగ్.. అస్థిపంజరం లభ్యం

మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో అదృశ్యమైన చుక్క కృష్ణ(55) ఆత్మహత్య చేసుకోగా అస్థిపంజరం లభించినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇంట్లో గొడవపడి ఫిబ్రవరి 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇలాగే వెళ్లి వస్తుండడంతో ఇంట్లోవాళ్లు నాలుగైదు రోజులు ఎదురుచూశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గ్రామ సమీపంలోని అటవీలో ఉరేసుకోగా అస్థిపంజరంగా గుర్తించారు.
Similar News
News September 12, 2025
RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 12, 2025
శిథిల భవనాలకు ప్రతిపాదనలు అందజేయాలి: కలెక్టర్

జిల్లాలో వర్షం కారణంగా ప్రభావితమైన శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 108 ఉన్నాయని వీటికి గడువులోగా నివేదికలు తయారు చేయాలన్నారు.
News September 11, 2025
మెదక్: కళాశాలను సందర్శించిన కలెక్టర్

మెదక్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.