News January 8, 2025

మెదక్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతి సందర్భంగా మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 10, నుంచి 18 వరకు (14, 15 మినహా) 280 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్లాన్ చేశారు. కాగా సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో అదనందగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సర్వీసుల్లో ‘మహాలక్ష్మి’ వర్తింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News January 9, 2025

మెదక్: జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌తో కలిసి జాతీయ టీబీ బృందం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

News January 8, 2025

మెదక్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలసి వీసీ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు.. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు.

News January 8, 2025

మెదక్: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి

image

రాష్ట్రంలోని SC, ST, BC, జ‌న‌ర‌ల్‌ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.