News December 28, 2025
మెదక్: సండే స్పెషల్.. నాటు కోళ్లకు డిమాండ్

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సండే సందడి కనిపిస్తోంది. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ దుకాణాలకు దారి తీస్తున్నారు. బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచిగా ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వాటిపైనే మక్కువ చూపుతున్నారు. బాయిలర్ రూ.200, మటన్ రూ.800, నాటుకోడి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతోంది. మీ ప్రాంతాల్లో ధర ఎలా ఉందో కామెంట్ చెయ్యండి.
Similar News
News December 31, 2025
శాస్త్రీయ దృక్పథంతోనే ప్రగతి: కలెక్టర్ తేజస్

విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో జరిగిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన సాంకేతిక నమూనాలను అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
News December 31, 2025
కామారెడ్డి: ఏడాదంతా కోతుల బెడద.. కుక్క కాట్లు

కామారెడ్డి జిల్లాలో 2025 సం.లో ప్రధాన పట్టణాలతో సహా పలు గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా పెరిగి ఇళ్లను చిందవందర చేయడమే కాకుండా అడ్డుపడిన వారిపైకి వచ్చి కరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వీధి కుక్కలతో బెంబేలెత్తిపోయిన ప్రజలు విసిగి పోయారు. కుక్క కాటుకు వల్ల తీవ్ర అస్వస్థత గురైన ఘటనలు ఈ ఏడాదిలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా కోతులు, కుక్క కాటుకు చిన్నపిల్లలు గురయ్యారు.
News December 31, 2025
గద్వాల్: దివ్యాంగుల వివాహాలకు ప్రభుత్వం రూ.లక్ష ప్రోత్సాహకం

దివ్యాంగుల వివాహాలకు ప్రభుత్వం రూ లక్ష ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు దివ్యాంగులు సకలాంగుల వివాహాల సందర్భంలో మాత్రమే ప్రోత్సాహకం ఇచ్చే వారిని ఇకపై దివ్యాంగులు దివ్యాంగుల వివాహాలకు ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అర్హులైన వారు www.epass.telangana.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


