News June 29, 2024

మెదక్ సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి తనిఖీ

image

సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ మెదక్ సబ్ జైలునుతనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వంటశాల తనిఖీ చేసి ఆహార నాణ్యతపై జైలు పర్యవేక్షణ అధికారితో చర్చించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ముద్దాయిలకు వివిధ అంశాలపై లీగల్ ఏయిడ్ అపాయింట్మెంట్, జైల్ అదాలత్, ప్లీ బార్గెయినింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైలు సిబ్బంది ఉన్నారు.

Similar News

News November 3, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

News November 3, 2025

మెదక్: 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 18,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.

News November 2, 2025

మెదక్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న మూడు రోజుల్లో మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం తెలిపారు. ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడాలని, రైతులకు వర్షం వల్ల ఎలాంటి అసౌకర్యం, ధాన్యం తడిచి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.