News December 17, 2025

మెదక్: సమయం లేదు ఓటరన్నా.. పరిగెత్తు..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటకే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి, బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. గడువు ముగిసేలోపు తమ మద్దతుదారులందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

Similar News

News December 21, 2025

యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలి: నిర్మల్ కలెక్టర్

image

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.

News December 21, 2025

వరంగల్: కనీస వసతులు లేక చలికి వణుకుతున్న విద్యార్థులు!

image

WGL జిల్లాలో చలి తీవ్రత పెరిగి ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు కనీస వసతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ SC, ST, BC కళాశాలల్లోని వసతి గృహాల్లో కిటికీలకు తలుపులు లేక తట్టు బస్తాలు అడ్డు కట్టారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పడకలు లేక నేలపై నిద్రిస్తున్నారని, దుప్పట్లు ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాగా, పై చిత్రం WGL రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలోనిది.

News December 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.