News October 12, 2025

మెదక్: హత్యాచారం.. అసలేం జరిగింది..?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన <<17982015>>గిరిజన మహిళ హత్యాచారం<<>> ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం..పని ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు మహిళను కొల్చారం(M) పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ వెంచర్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోగా అడ్డుకుంది. దీంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారం చేసి, దారుణంగా కొట్టారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది.

Similar News

News October 12, 2025

శ్రీ రాంసాగర్‌ నీటిమట్టం 80.053 TMCలు

image

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గడంతో ప్రస్తుతం 6,790 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 TMCలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 80.053 టీఎంసీలు(1090.90 అడుగులు)గా నమోదైంది. కాకతీయ కాలువ ద్వారా 5000, లక్ష్మి కాలువ ద్వారా 200, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. FFC అలీ సాగర్, గుప్తా ఎత్తిపోతలలకు నీటి విడుదలను నిలిపివేశారు.

ప్రొద్దుటూరు: నకిలీ మద్యం ఇలా గుర్తించండి.!

image

స్కాన్ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించొచ్చని పొద్దుటూరు ఎక్సైజ్ సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. APTATS యాప్ ప్లేస్టోర్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ల మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తయారీ వివరాలు వస్తాయన్నారు. ఆ మద్యం బాటిల్ ఒరిజినలా? నకిలీనా? అనే సమాచారం తెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరులో దుకాణాల్లో నకిలీ మద్యం లేదన్నారు.