News March 14, 2025

మెదక్: హోళీ వేడుకలలో అదనపు కలెక్టర్

image

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైక్యతా భావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటన్నారు.

Similar News

News February 28, 2026

మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

image

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఘనంగా వీడ్కోలు

image

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్‌గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన రాహుల్ రాజ్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్‌గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.

News February 27, 2026

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.