News February 15, 2026

మెదక్: 16న మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను ఈనెల 16న పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉ.11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మ.12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సమావేశానికి కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

Similar News

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు మెదక్ జిల్లా విద్యార్థులు సిద్ధం

image

* ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల
* పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య: 12,334
* ప్రథమ సంవత్సరం 6,309 (ఒకేషనల్ 599)
* ద్వితీయ సంవత్సరం 6,025 (ఒకేషనల్ 553)
* జిల్లాలో మొత్తం పరీక్ష కేంద్రాలు : 28
* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిఘా
* పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి
పరీక్షలంటే టెన్షన్ వద్దు.. ఒత్తిడిని జయిస్తే మీదే విజయం

News February 20, 2026

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మెదక్ కలెక్టర్

image

10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. బట్టి పద్ధతికి దూరంగా ఉండి అంశాలపై పట్టు సాధించాలని, ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.

News February 20, 2026

ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

image

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్‌తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.