News July 20, 2024
మెదక్: 22న కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి 2:30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News August 21, 2025
మెదక్ జిల్లా ఖజానా శాఖ ఏడీగా అనిల్ కుమార్ బాధ్యతలు

మెదక్ జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా(ఏడీ) అనిల్ కుమార్ మరాటి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వహిస్తానని అనిల్ తెలిపారు. ఎస్టీఓ వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి తదితరులున్నారు.
News August 21, 2025
మెదక్: జిల్లాలో ఇంకా నిండని సగం చెరువులు

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సగం చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో మొత్తం 2,632 చెరువులున్నాయని, అందులో 25-50 % 63, 50-75% 290, 75-100% 705 చెరువులు నిండాయన్నారు. 1574 చెరువులు అలుగులు పారుతున్నాయని వివరించారు. మెదక్ ప్రాంతంలో ఇంకా చెరువుల్లోకి నీరు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
News August 21, 2025
MDK: రేపు 492 జీపీలలో పనుల జాతర: డీఆర్డీఓ

492 పంచాయతీలలో పనుల జాతర-2025 ఘనంగా నిర్వహించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, పూర్తి కావాల్సిన పనులకు శంకుస్థాపనలు చేయాలని సూచించారు. శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేస్తామన్నారు. పనుల జాతరలో భాగంగా 22న ముఖ్యంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫామ్ షెడ్లు ప్రారంభించాలని పేర్కొన్నారు.