News April 24, 2024
మెదక్: 24మంది అభ్యర్థులు, 35 సెట్ల నామినేషన్లు

మెదక్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి పేరు ఖరారు చేసినా ఇంకా నామినేషన్ వేయలేదు. ఈనెల 24న వేస్తారని సమాచారం. ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.
Similar News
News July 10, 2025
MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 10, 2025
మెదక్: యాప్లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
News July 10, 2025
మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.