News December 5, 2025

మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

Similar News

News February 12, 2026

మెదక్: ఓటు వేసిన 99 ఏళ్లు వృద్ధుడు

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన 99 ఏళ్ల మర్తి కిష్టయ్య తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తున్న తరుణంలో, ఈ వయసులో కూడా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గుర్తు చేశారు. కిష్టయ్య సంకల్పాన్ని చూసి స్థానికులు, అధికారులు అభినందించారు.

News February 12, 2026

మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News February 12, 2026

మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

image

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్‌లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్‌లో 81.30%, నర్సాపూర్‌లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.