News February 5, 2025
మెదక్: 30 ఏళ్ల కల సాకారం: మంత్రి దామోదర్
30, 40 ఏళ్ల కల నేడు సాకారం అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదన్నారు. వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని, వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.
Similar News
News February 5, 2025
మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు
మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.
News February 5, 2025
మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి
ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక
ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్‌లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.