News February 2, 2025
మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్‌ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.
Similar News
News November 3, 2025
ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్‌మనీ+బోనస్‌లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.
News November 3, 2025
పరవాడ: తీరానికి కొట్టుకు వచ్చిన విద్యార్థి మృతదేహం

పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో స్నానం చేస్తుండగా ఈనెల 1వ తేదీన గల్లంతైన విద్యార్థి భాను ప్రసాద్ (15) మృతదేహం ఆదివారం అదే తీరానికి కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతిని తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.


