News February 2, 2025

మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

image

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్‌ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.

Similar News

News February 26, 2026

మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

image

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News February 26, 2026

BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

image

మెదక్‌ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్‌గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్‌కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.

News February 26, 2026

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

image

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.