News January 11, 2026

మెదక్: GREAT.. 125 ఏళ్లు జీవించింది!

image

శివంపేట మండలం అల్లీపూర్‌కి చెందిన శతాధిక వృద్ధురాలు బైకాని లక్ష్మమ్మ (125) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 125 ఏళ్ల నిండు ఆయుష్షుతో జీవించిన ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి మరణంతో కుమారుడు శేఖరయ్య, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గ్రామస్థులు ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.

Similar News

News February 21, 2026

నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

image

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.

News February 21, 2026

నిర్మల్: నామినేటెడ్ పోస్టులకు ‘గ్రీన్ సిగ్నల్’

image

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి పచ్చజెండా ఊపడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. మార్చి 15లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం రాని వారు ఇప్పుడు ఈ పదవులపై కన్నేశారు. తమకే దక్కాలని అధిష్ఠానం వద్ద పైరవీలు చేస్తున్నారు. ఎవరికి ఏ పదవి దక్కుతుందోనని కేడర్‌లో ఆసక్తి నెలకొంది.

News February 21, 2026

సిద్దిపేట: తెల్లవారుజామున యాక్సిడెంట్

image

బెజ్జంకి రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్తున్న కారు గాగిలాపూర్-తోటపల్లి శివారులో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.