News February 14, 2025
మెదక్: MLC బరిలో 71 మంది..

ఉమ్మడి MDK, KNR, NZB. ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో 71 మంది నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
Similar News
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.


