News February 1, 2026
మెదక్: NATIONALలో సిల్వర్ మెడల్

మాస్టర్స్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2026 లాంగ్ జంప్‌లో రిటైర్డ్ పీడీ డా.కే.ప్రభు సిల్వర్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో జరిగాయి. గత నెలలో రాష్ట్ర స్థాయి మాస్టర్ పోటీలు కరీంనగర్‌లో జరగ్గా గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించారు. ప్రభు మెడల్ సాధించడం పట్ల వ్యాయామం ఉపాధ్యాయులు, గుల్షన్ క్లబ్ సభ్యులు అభినందించారు.
Similar News
News February 2, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మెదక్‌లో కాంగ్రెస్ బోణీ

మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. 32వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం రెండవసారి ఏకగ్రీవమైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన గోదల జ్యోతి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మానస ఏకగ్రీవమయ్యారు. మానస 2020లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మానస వరుసగా రెండుసార్లు ఏకగ్రీవం కావడం విశేషం.
News February 1, 2026
MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 1, 2026
మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.


