News April 23, 2025
మెదక్: OU పరిధిలో బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..
Similar News
News April 23, 2025
అనకాపల్లి జిల్లాలో రూ.59 కోట్ల బకాయి

అనకాపల్లి జిల్లాలో ఉపాధి కూలీలకు నాలుగు రోజుల్లో రోజుల్లో వేతన బకాయిలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు డ్వామా అధికారులు మంగళవారం తెలిపారు. గత 12 వారాల నుంచి కూలీలకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఈ నేపథ్యంలో కేంద్రం రూ.961 కోట్లను వేతన బకాయిల చెల్లింపుకు విడుదల చేసింది. అనకాపల్లి జిల్లాలో కూలీలకు సుమారు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.
News April 23, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News April 23, 2025
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: ADB SP

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.