News February 2, 2025
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. నెక్కొండ మండలంలో హాస్టళ్లను కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి, భోజనం రుచి చూసి మాట్లాడారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాల రికార్డులు పరిశీలించి సమయ పాలన పాటించాలన్నారు.
Similar News
News February 2, 2025
అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్
‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్‌గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
News February 2, 2025
కామారెడ్డి: వెటర్నియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నియన్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోచయ్య, కార్యదర్శిగా బి.కొండల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.ప్రేమ్ సింగ్, కోశాధికారిగా ఎన్.నితిన్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులందరికీ పశుసంవర్ధక శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.
News February 2, 2025
కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.