News January 15, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

Similar News

News April 5, 2026

ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

image

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.

News April 5, 2026

భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

image

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News April 5, 2026

ట్రంప్ పర్మిషన్ లేకపోతే ఆయిల్ కూడా కొనలేరు: రాహుల్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చమురు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్‌గానే అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత, డేటాను ట్రంప్ చేతుల్లో ఆయన పెట్టారు. రాజీపడటం వల్లే ఇదంతా జరిగింది’ అని అస్సాంలోని గోలాఘాట్‌లో అన్నారు.