News November 13, 2025

మెన్‌స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

image

ఒక మెన్​స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్​ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.

Similar News

News March 9, 2026

మిడిల్ ఈస్ట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: జైశంకర్

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై MEA జైశంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మన ఇంధన అవసరాల విషయంలో మిడిల్ ఈస్ట్ కీలకమన్నారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.

News March 9, 2026

క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఉత్పత్తులివే!

image

క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్‌తో పాటు మానవాళి అవసరాలను తీర్చే మరెన్నో ఉత్పత్తులు తయారవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, మెరైన్ ఫ్యూయల్ లభిస్తాయి. అలాగే ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్ & రబ్బర్లు, డిటర్జెంట్స్(సబ్బులు), పెయింట్స్‌ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇంటి అవసరాల కోసం LPG, కొవ్వొత్తులు, వాసెలిన్, లిప్‌స్టిక్ తయారీలోనూ ఇది కీలకం. ముడి చమురు వేస్ట్‌తో తారు రోడ్లు వేస్తారు.

News March 9, 2026

మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

image

IIT రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీని ప్రకటించింది. మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏప్రిల్‌లో ఓపెన్ అవుతాయి. ఏప్రిల్ 6 నుంచి విదేశీ విద్యార్థులకు, ఏప్రిల్ 23 నుంచి భారతీయ విద్యార్థులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ. హాల్ టికెట్లు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. <>jeeadv.ac.in<<>> ద్వారా అప్లై చేసుకోవచ్చు.