News December 30, 2025
మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్

జిల్లాలోని చెంచు గిరిజనులకు మెరుగైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన ఉత్పత్తులపై శిక్షణ, జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. డీఎఫ్‌ఓ విఘ్నేష్, డీఆర్‌ఓ రామునాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News December 31, 2025
మెదక్ జిల్లాలో మహిళల భద్రతకు షీటీమ్స్: ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్‌లో ఈవ్ టీజింగ్ కేసుల్లో 2 ఎఫ్‌ఐఆర్‌లు, 7 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వేధింపులకు గురైతే 100 లేదా షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 31, 2025
సంప్రదాయానికి టెక్నాలజీ జోడింపు.. గంగిరెద్దుల ప్రదర్శన

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ కొత్తపేట గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న గంగిరెద్దుల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంటోంది. సంప్రదాయానికి ఆధునిక టెక్నాలజీని జోడిస్తూ గంగిరెద్దుల నుదుటిపై క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పైసలు చెల్లించే ఈవిధానం ప్రేక్షకులకు విశేష ఆకర్షణగా మారింది. సంప్రదాయం-టెక్నాలజీ సమ్మేళనం సంక్రాంతి సంబరాలకు కొత్తరంగు తెచ్చింది.
News December 31, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన indices అంతకంతకూ పెరుగుతూ ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 429 పాయింట్ల లాభంతో 85,104 వద్ద.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 26,092 దగ్గర ట్రేడవుతోంది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ట్రెంట్, టైటాన్ షేర్లు లాభాల్లో.. TCS, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.


