News December 19, 2025

మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

image

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్‌లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.

Similar News

News December 19, 2025

GNT: ‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

image

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ హామీ ఇచ్చారు. ‘సామ్నా’ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఆయనను కలిసి అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

News December 19, 2025

తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్‌కు డీజీపీ ప్రశంసలు

image

తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్‌ను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు. గతంలో ఐటీ కోర్ ఎస్ఐగా పని చేస్తుండగా బాపట్ల రూరల్ పీఎస్ పరిధి సూర్యలంకలోని హరిత రిసార్ట్ వెబ్‌సైట్‌ను పోలిన ఫేక్ వెబ్ సైట్లు ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో నాయబ్ రసూల్ చేసిన కృషిని కొనియాడుతూ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డును డీజీపీ అందజేసి అభినందించారు. ఇదే ముఠాపై దేశ వ్యాప్తంగా 127 కేసులు ఉన్నాయి.

News December 19, 2025

పతాక నిధి సేకరణలో గుంటూరుకు ప్రథమ స్థానం

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి రూ. 17,67,363 నిధులు సేకరించినందుకు గానూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ జాబితాలో బాపట్ల ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి.