News September 6, 2025
మెరుగైన వైద్యసేవలను అందించాలి: VZM కలెక్టర్

క్షేత్రస్థాయిలో మెరుగైన వెద్యసేవలను అందించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వైద్యారోగ్య, పశు సంవర్థకశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా నిర్వహించారు. PHC, CHCల ద్వారా అందిస్తున్న వైద్యం, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా అందిస్తున్న సేవలపై సమీక్షించారు.
Similar News
News September 6, 2025
VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ టన్నుల యూరియా RSK, ప్రయివేటు వర్తకుల వద్దా సిద్ధంగా ఉందని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమవారం మరో 850 టన్నులు, గురువారం 1,000 టన్నులు యూరియా జిల్లాకు రానుందని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖరుకి మరో 3,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. రైతులు షాపులవద్ద గంటల తరబడి క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు.
News September 6, 2025
VZM: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష కోసం కంట్రోల్ రూమ్

విజయనగరం జిల్లాలో ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్ల రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి శనివారం తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి ఈ కంట్రోల్ రూమ్ నంబరు 08922-236947కి సంప్రదించవచ్చునని సూచించారు.
News September 6, 2025
VZM: బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం

విజయనగరం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కల్పించారు. బాలల పరిరక్షణ చట్టాల అమలులో నిధుల కొరత, అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత, ప్రత్యేక పోలీస్ యూనిట్ల లోపం, శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, వసతి గృహాల కొరత వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. బాలల హక్కులపై అవగాహన కల్పించాలన్నారు.