News January 15, 2025
మెళియాపుట్టిలో వారికి కనుమ రోజే భోగి
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని కోసమాలలో వింత ఆచారం పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమరోజు భోగి జరుపుకోవడం వీరి ప్రత్యేకత. తర తరాలనుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఈ వీధిలో నేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో పండగ రోజు కూడా నేత వస్త్రాలు నేయడంలో బిజీగా ఉంటారు. కాబట్టి భోగి రోజు సాధ్యంకాక కనుమ రోజు భోగి జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు.
Similar News
News January 22, 2025
శ్రీకాకుళం: ఏంటి ఈ హెలికాప్టర్ టూరిజం..!
అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 22, 2025
రణస్థలం: బాలికపై యువకుడి అఘాయిత్యం
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 22, 2025
మావోయిస్టు ముఖ్యనేతతో సిక్కోలుకు అనుబంధం
మావోయిస్టు ముఖ్యనేత చలపతికి శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం ఉంది. చలపతి మృతితో జిల్లాలోని ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడింది. పలాస మండలం బొడ్డపాడు గ్రామం అల్లుడు చలపతి. పీపుల్స్ వార్ పార్టీలో చలపతి కీలకపాత్ర పోషించారు. అప్పట్లో బొడ్డపాడు గ్రామానికి చెందిన రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లిచేసుకుని ఆమెను కూడా అజ్ఞాత జీవితంలోకి తీసుకువెళ్లిపోయారు. 1988 నుంచి 1994 వరకు ఉద్దానం ప్రాంతంలో పార్టీని నడిపించారు.