News January 8, 2025
మెళియాపుట్టిలో సినిమా షూటింగ్ సందడి
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.
Similar News
News January 9, 2025
రేపు ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాంటేషన్ ప్రారంభం
ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రమంత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 315 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించామని వివరించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
News January 9, 2025
ఇచ్ఛాపురం: ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6 నుంచి 341 రోజుల పాటు సాగింది. 2019 జనవరి 9లో ముగిసింది. ఈ పాదయాత్ర 2019 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపునకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఒక స్తూపం నిర్మించారు. గురువారం ఇచ్ఛాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్తూపం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
News January 9, 2025
తిరుపతి ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.