News October 6, 2025
మెళియాపుట్టి: కరెంట్ షాక్‌తో 30 ఏళ్ల యువకుడి మృతి

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్‌తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 21, 2026
నరసన్నపేట: 48 గంటల్లోనే జాబ్ కార్డు మంజూరు

ఉపాధి హామీ పథకం లో భాగంగా లబ్ధిదారులు జాబ్ కార్డ్ కోరిన 48 గంటలలోనే మంజూరు చేయడం జరుగుతుందని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ లవ రాజు తెలిపారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ప్రజా వేదికలో భాగంగా శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వేతనదారుడికి పని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
News February 21, 2026
SKLM: ‘ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apms.ap.gov.inలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.