News April 10, 2025

మెళియాపుట్టి: విషం తాగి వృద్ధుడు ఆత్మహత్య

image

మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యనారాయణ (82) మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు బుధవారం ఎస్సై పి.రమేశ్ బాబు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2025

నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

News April 18, 2025

శ్రీకాకుళం: కలెక్టర్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో కలిసి కుప్పిలి సంఘటనలో ఉపాధ్యాయుడుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కలెక్టర్‌ని కోరారు. హెచ్ఎం ప్రమోషన్ సీనియారిటీ లిస్టులో ఉన్న ఇద్దరి పైన కూడా ఛార్జెస్ పెండింగ్‌ను క్లియర్ చేసి ప్రమోషన్‌కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2025

శ్రీకాకుళం: భద్రతపై ఈవీఎం నోడల్ అధికారి సంతృప్తి

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లోని గోదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

error: Content is protected !!